ప్రత్యేక అవసరాలు గల పిల్లలు

  •  2023-24 సంవత్సరంలో అన్ని21 భవిత కేంద్రాల ద్వారా 490 ప్రత్యేక అవసరాలు గల పిల్లలు నమోదు కాబడి విద్యను అభ్యసించుచున్నారు.
  • జిల్లాలో 42 మంది ఐ.ఈ.ఆర్.టి లకు గాను ప్రస్తుతం 42 మంది ఐ.ఇ.ఆర్.టి లు పని చేయుచున్నారు.
  • 3 గురు ఫిజియోదెరపిస్టుల ద్వారా వారమునకు ఒక ఫిజియో ధెరపీ క్యాంపు చొప్పున 315 మంది పిల్లలకు ఫిజియోదెరఫి అందించుట జరుగుచున్నది.
  • గత సంవత్సరం 222 మంది CwSN పిల్లలకు గాను అవసరమైన వారికి Aids & Appliances అందించడం జరిగినది.
  • CWSN పిల్లలకు అవసరమైన Aids & Appliances గుర్తించుటకు గాను ది.28.03.2024, 30.03.2024 మరియు 04.04.2024 తీదీలలో Medical Assessment Camps నిర్వహించడం జరుగుతుంది.
  • 2023-24 సం,,నకు 1 నుండి 12 వ తరగతి వరకు చదువుచున్న 812 CWSN విద్యార్దినీ విద్యార్దులకు నెలకు 300/- చొప్పున ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించుట జరిగినది.
  • 2023-24 సం,,నకు ప్రత్యేక అవసరాలు గల 593 మంది CP (Cerebral Palsy), LD (Learning Disability)& MD (Multiple Disability) విద్యార్ధులకు ఒక నెలకు రూ.300 చొప్పున ఎస్కార్ట్ అలవెన్స్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించడమైనది.
  • 2023-24 సం,,నకు 1 నుండి 12 వ తరగతి వరకు చదువుచున్న 997 CWSN బాలికలకు (Girls Stipend)  నెలకు 200/- చొప్పున ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించడమైనది.
  • గృహ ఆధారిత విద్యను అభ్యసిస్తున్న 175 మంది CWSN విద్యార్ధులకు రూ.300/- (HBE Allowance) చొప్పున, 58 మంది విద్యార్ధులకు రీడర్ అలవెన్స్ రూ.300/- చొప్పున విడుదల చేయడం జరుగుతుంది.
  • 2023-24 సం,, నకు గాను 42 మంది IERP లకు, 21 మంది IEDSS లకు, 33 మంది Blind, 36 మంది Low Vision మరియు 111 మంది HI పిల్లలకు TABS అందించడం జరిగినది.
  • 2023-24 సం,, నకు 42 మంది IERP లకు 21 మంది IEDSS టీచర్స్ కు IE Activities, Tabs Installation మరియు Tabs Usage పై ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
  • 21 ఐ.ఇ.ఆర్.సి సెంటర్ల ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కంప్యూటర్ విద్యను అందించడం జరుగుచున్నది.
  • 2023-24 సం,, నకు గాను 360 మంది CwSN పిల్లల స్పోర్ట్స్ మీట్ రూ.80,000/- ల ఖర్చుతో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగినది.
  • MR Category కలిగిన అర్హత ఉన్న 28 CWSN పిల్లలకు MR Kits అందించడం జరిగినది.
  • 2023-24 విద్యా సంవత్సరమునకు సంబంధించి జిల్లాలో కాకినాడ, పిఠాపురం, ప్రత్తిపాడు మరియు తుని సెంటర్ లలో CWSN విద్యార్ధులకు అవసరమైన పరికరాల కొరకు మెడికల్ అసిస్టెంట్ క్యాంపు నిర్వహించడమైనది.
  • 2024-25 విద్యా సంవత్సరములో CWSN విద్యార్ధులను పాఠశాలల్లో  జాయిన్ చేయుటకు 42 మంది IERP లతో అన్నీ మండలాల్లో 1-5-2024 నుండి ప్రతీ గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించుచున్నాము.