అకడమిక్ మోనిటరింగ్

విద్యా ప్రమాణాల పెంపుదల కోసం చేపట్టే కార్యక్రమాల వివరాలు:

  • జిల్లాలో మొత్తం 94 స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ నిర్వహించడం జరుగుచున్నది.
  • ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులకు (NISHTHA 3.0 - National Initiative for School Heads and Teachers Holistic Advancement) దీక్షా ఫ్లాట్ ఫాం నందు ఆన్ లైన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుచున్నది. NISHTA 4.0 ఆన్ లైన్ ట్రైనింగ్ ను మండల విద్యాశాఖాధికారులు మరియు సి.ఆర్.పి లకు ఇవ్వడం జరుగుచున్నది.
  • ప్రాధమిక మరియు ప్రాధమికోన్నత పాఠశాలలకు లైబ్రరీ పుస్తకములు ఇవ్వడం ద్వారా మరియు గూగుల్ రీడ్ ఎలాంగ్ యాప్ ద్వారా భాషాభివృద్ది కార్యక్రమం జరుగుచున్నది.
  • జిల్లాలో ఎంపిక కాబడిన ప్రభుత్వ పాఠశాలల్లో Ek Bharath Sreshta Bhaarath కార్యక్రమంలో భాగంగా భాషాభివృద్దిని పెంపొందిచడం కొరకు ఆన్ లైన్ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
  • TaRL (Teaching at Right Level) మరియు Teach Tool (SALT - Statistical Analysis and Learning Tool) ట్రైనింగ్స్ ద్వారా నాణ్యతతో కూడిన విద్యను అందించుట జరుగుచున్నది.
  • పాఠశాల ప్రదానోపాధ్యాయులకు Leadership Training ఇవ్వడం జరిగినది.
  • పాఠశాల అభివృద్ధి కొరకు విద్యాంజలి 2.0 ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది.
  • ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాలల్లో ఫిట్ ఇండియా ప్రోగ్రాం నిర్వహించడం జరుగుచున్నది.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా ప్రభుత్వ / జిల్లా పరిషత్ / మండల పరిషత్ / గవర్నమెంట్ / ఎయిడెడ్ యాజమాన్యముల లోని పాఠశాలల విద్యార్ధులందరికీ నాణ్యమైన విద్యను అందుబాటులో ఉంచుటకు ఒక్కొక్క విద్యార్ధికి సుమారు రూ.30000/- విలువగల BYJUS content ను వారి స్మార్ట్ ఫోన్స్ ద్వారా అందించుచున్నది.
  • TOFEL Primary Level పరీక్ష 3,4,5 వ తరగతి విద్యార్ధులకు, జూనియర్ లెవెల్ పరీక్ష 6,7,8 మరియు 9 వ తరగతి విద్యార్ధులకు నిర్వహించట జరిగినది. ఉపాద్యాయులకు TOFEL online training ఇవ్వడం జరిగినది.